
కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం..
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద లోలెవల్ వంతెనలు ముని గిపోయి నిలిచిపోతున్న రాకపోకల విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. ఎగువమానేరు పొంగడంతో నెల రోజులుగా రాకపోకలు నిలిచిపోగా రవీందర్‌రావు గురువారం పరిశీలించారు. వరద ప్రవా హానికి వచ్చిన చెట్లు, రాళ్లు, మట్టి తట్టుకొని లోలెవల్ వంతెనలు మునిగిపోతున్నాయన్నారు.
వర్షం ముసురుకుంది
సిరిసిల్ల: జిల్లాలో గురువారం వర్షం ముసురుకుంది. రుద్రంగిలో 3.2 మిల్లీమీటర్లు, చందుర్తిలో 1.9, వేములవాడ రూరల్‌లో 2.1, బోయినపల్లిలో 2.0, సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడలో 1.3, వీర్నపల్లిలో 1.2, ఎల్లారెడ్డిపేటలో 0.4, ముస్తాబాద్‌లో 1.0, తంగళ్లపల్లిలో 1.8, ఇల్లంతకుంటలో 1.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గంభీరావుపేటలో పెద్దగా వర్షం పడలేదు.