
కంపోస్టు షెడ్లు ఖాళీ !
లక్ష్యానికి దూరంగా కంపోస్టుయార్డులు బహిరంగ ప్రదేశాల్లోనే చెత్త ఉపాధిహామీలో ఒక్కో షెడ్డుకు రూ.2.50లక్షలు తడి, పొడి చెత్త సేకరణపై నిర్లక్ష్యం
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో వర్మికంపోస్టు షెడ్లు నిరుపయోగంగా మారాయి. మూడేళ్ల క్రితం అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వర్మికంపోస్టు తయారీని ఇప్పుడు మరిచిపోయారు. రూ.2.50 లక్షలతో నిర్మించిన షెడ్లు వృథాగా పడి ఉన్నాయి. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా ఉపాధిహామీలో చేపట్టిన కంపోస్టుషెడ్లు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాయి. పట్టించుకునే వారు లేక పంచాయతీలకు ఆదాయం సైతం రావడం లేదు.
కంపోస్టు షెడ్ల లక్ష్యం ఇదీ..
గ్రామాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను పంచాయతీ కార్మికులు సేకరిస్తారు. ట్రాక్టర్లు, ఆటోలలో సేకరించిన చెత్తను షెడ్లకు తరలిస్తారు. అక్కడ ప్లాస్టిక్, ఇతర వస్తువులను వేరు చేసి కంపార్టుమెంట్లలో వేస్తారు. రెండు ప్రత్యేక కంపార్టుమెంట్లలో చెత్త, కుళ్లిన కూరగాయలు, ఇతర వస్తువులను వేస్తారు. దీనిపై వానపాములను వేసి కుళ్లపెడతారు. అది 40 రోజులకు ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును సేకరించి గ్రామాల్లో అవసరమైన వారికి విక్రయించి ఆదాయం పొందుతారు. అలాగే వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఎరువుగా మార్చేందుకు, వ్యర్థాల విభజనకు చర్యలు చేపడతారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట, పోతుగల్, గూడెం గ్రామాలు వర్మికంపోస్టు ఎరువులను విక్రయించి భారీగా ఆదాయం పొందాయి. కానీ నేడు వర్మికంపోస్టు తయారీని పట్టించుకోవడం లేదు.

కంపోస్టు షెడ్లు ఖాళీ !

కంపోస్టు షెడ్లు ఖాళీ !