పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

Sep 25 2025 7:07 AM | Updated on Sep 25 2025 7:07 AM

పౌష్ట

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం శ్రామిక వర్గాల సంక్షేమమే లక్ష్యం ● సీపీఐ జిల్లా కార్యదర్శి సుదర్శన్‌ హిందూత్వ జీవన విధానంతో విశ్వశాంతి ● ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహ కార్యవాహ పద్మారెడ్డి వెయ్యి బడులు తెరవండి ● కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు

సిరిసిల్లటౌన్‌/వేములవాడరూరల్‌: పౌష్టికాహారంతోనే చిన్నారులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ రూరల్‌ మండలం జయవరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీడీపీవో ఉమారాణి, సూపర్‌వైజర్లు సుష్మిత, సరిత, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త రోజా తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: శ్రామిక వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీపీఐ పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో బుధవారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం, కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, నాయకులు కడారి రాములు, నల్ల చంద్రమౌళి, పంతం రవి, మీసం లక్ష్మణ్‌, కేవీ అనసూర్య, దుడ్రపెళ్లి రవీందర్‌, బచ్చుపల్లి శంకర్‌, పండుగ పోచమల్లు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): హిందూత్వ జీవన విధానం విశ్వశాంతికి మూలమని ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహ కార్యవాహ వుచ్చిడి పద్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చీకోడులో బుధవారం ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల స్థాపన, విజయ దశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పద్మారెడ్డి మాట్లాడుతూ హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్‌ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందన్నారు. అన్ని మతాలను సమన్వయపరిచి సనాతన జీవన విలువలు హిందూత్వంలో ఉన్నాయన్నారు. కరెడ్ల మల్లారెడ్డి, కరుణాకర్‌, బాధ నరేశ్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: దళితవాడల్లో వెయ్యి గుడుల నిర్మాణం కన్నా వెయ్యి బడులు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు కోరారు. సిరిసిల్లలోని చేనేత, వస్త్ర వ్యాపార సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన కేవీపీఎస్‌ జిల్లా రెండో మహాసభల్లో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు చేస్తున్న రాజ్యాంగ రద్దు కుట్రలను యువతరం ప్రతిఘటించాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌కు అప్పచెప్పే విధానాలపై పోరాడాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎర్రవెళ్లి నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేశ్‌, నాయకులు మూషం రమేశ్‌, మల్లారపు అరుణ్‌, విమల, గన్నేరపు నర్సయ్య, రమేశ్‌చంద్ర, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతో   సంపూర్ణ ఆరోగ్యం
1
1/3

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతో   సంపూర్ణ ఆరోగ్యం
2
2/3

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతో   సంపూర్ణ ఆరోగ్యం
3
3/3

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement