
ఎల్‌ఎండీకి నీటి విడుదల
నిలిచిన ఎత్తిపోతలు
బోయినపల్లి: మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి 9వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎస్సారెస్పీ నుంచి 4,500, మరో 3500 వేల క్యూసెక్కులు వరద వస్తోంది.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్‌లో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మహా చండీయాగం నిర్వహించారు. వేదపండితులు కాళీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో మాజీ సర్పంచ్ గౌతంరావు, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భూదయ్య, చెక్కపల్లి రాజు, భాను, అంజయ్య, ధర్మేందర్, నవీన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ: ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు. కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించి బతుకమ్మ వేడుకల్లో మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, ట్రెజరర్ బొజ్జ మహేందర్, ఉపాధ్యక్షుడు కట్కం జనార్దన్, ఏజీపీ బొడ్డు ప్రశాంత్, భాను, మహిళా ప్రతినిధి పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి ఎత్తిపోతలు బుధవారం నిలిపివేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.29 టీఎంసీల నీరు ఉంది.

ఎల్‌ఎండీకి నీటి విడుదల