
అంజన్న భక్తులకు వసతి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారంలోని జోడాంజనేయస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగం పుంజకున్నాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల మధ్య రెండు మున్సిపాలిటీల ప్రజలకు అందుబాటులో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ కొత్త వాహనాల పూజలు చేయడం ప్రత్యేకం. అంతేకాకుండా హనుమాన్ జయంతి వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. అంజన్న మాలధారులు చాలా మంది రాత్రి వేళ ఆలయ పరిసరాల్లో నిద్ర చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే వసతి సరిగా లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల నిధులు మంజూరు చేశారు. వీటితో పనులు మొదలయ్యాయి.
నిధులు రాకతో పనుల్లో వేగం
అగ్రహారం అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించారు. సాండ్‌ఫండ్ రూ.31లక్షలతో ఆర్చిగేటు ప్రకారం, సాలహారం పనులు చేయనున్నారు. ఆలయం లోపల పరిసరాల్లో చుట్టూ రూ.34లక్షలతో గ్రానెట్, మార్బుల్ వేయనున్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా నడుస్తున్నాయి.
ప్రతిపాదనలు సిద్ధం
అంజన్న ఆలయం ముందు స్థలంలో సుమారుగా రూ.50లక్షలతో రేకులషెడ్డు, ఆలయం పక్క ప్రాంతంలో సుమారు రూ.50 లక్షలతో కమ్యూనిటీహాల్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు పనులకూ నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు.
అగ్రహారం హనుమాన్ ఆల యం పనులు వేములవాడ ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీ నివాస్, కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా సహాకారంతో ప్రారంభమై నడుస్తున్నాయి. పనులు చాల వేగవంతంగా నడుస్తున్నాయి. రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తవుతాయి.
– అగ్రహారం
అంజన్న ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్

అంజన్న భక్తులకు వసతి