
ఆరోగ్య కేంద్రం తనిఖీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారిణి రజిత తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం అనే కార్యక్రమం నిర్వహించే వైద్య శిబిరాలను తనిఖీ చేశారు. గొల్లపల్లి, వెంకటాపూర్ ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఆర్బీఎస్‌కే డాక్టర్ నహీమ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: అంతర్జాతీయ పారా త్రో క్రీడాకారిణి మిట్టపల్లి అర్చనకు ప్రభుత్వం తరఫున రూ.59వేల ఆర్థిక సహాయం అందింది. రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంజూరు చేసిన రూ.59వేలు ఆమె బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. డిసెంబర్‌లో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయపోటీల్లో పాల్గొననుంది. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చింది.
డీపీఆర్వో శ్రీధర్ సస్పెన్షన్
సిరిసిల్లటౌన్: జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వంగరి శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూప్‌లో ఓ కార్టూన్‌ను డీపీఆర్‌వో శ్రీధర్ షేర్ చేశారు. వివాదాస్పదమైన ఈ కార్టూన్‌ను ప్రస్తావిస్తూ.. సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.