
పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ/కోనరావుపేట: పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని 39 మందికి, కోనరావుపేట మండలంలోని 52 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నిమ్మపల్లిలో సుంకె మాధవి నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగబో మని, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు లేని ఊరు తాము చేపిస్తే మీరు (బీఆర్‌ఎస్) ఓట్లు అడగకుండా ఉండాలని సవాల్ విసిరారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, డైరెక్టర్లు బాశెట్టి నాగరాజు, అజీమ్, నాయకులు మానుక సత్యం, చేపూరి గంగాధర్, పెంతల శ్రీనివాస్, నందూగౌడ్, ప్రకాశ్ పాల్గొన్నారు.