
‘కడారి’ కడచూపునకు నిరీక్షణ
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస మృతదేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులకు బుధవారం రాత్రి వరకు నిరీక్షణ తప్పలేదు. రాత్రి 8 గంటల తర్వాత పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ, పోలీస్‌స్టేషన్‌ల వద్దనే ఎదురుచూశారు. గురువారం ఉదయం వరకు స్వగ్రామం తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చేరుకోనుంది. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల)
– వివరాలు IIలో..