
మానాలలో రాష్ట్ర విజిలెన్సు అధికారుల విచారణ
రుద్రంగి(వేములవాడ): మండలంలోని మానాల గ్రామంలో రాష్ట్ర విజిలెన్సు అధికారి ముకుందరెడ్డి, ఎఫ్‌ఆర్‌వో ఖలీలొద్దీన్‌తో కలిసి బుధవారం విచారణ చేపట్టారు. మానాలలో అటవీభూమిలో చెట్ల నరికివేతపై గ్రామస్తుల నిరసనలు, అటవీ భూముల కబ్జా శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. మానాల గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోతకు గురైన నీలగిరితోటను పరిశీలించారు. కొట్టివేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. రుద్రంగి ఎస్సై శ్రీనివాస్, పోలీస్, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు.