
వంతెన నిర్మించాలని నిరసన
వంతెనల నిర్మాణంపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని ఎన్గల్ ఎల్లమ్మ ఆలయం ఎదుట మంగళవారం ప్రజా గొంతుక చీఫ్ పుప్పాల మోహన్ ఆధ్వర్యంలో చెవిలో చెట్టుకొమ్మలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్గల్ శివారులోని వాగుపై వంతెనలు లేక రేణుక ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలకు వెళ్లే వారితో పాటు రైతులు, కూలీలు, గీతకార్మికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా వంతెనల నిర్మాణం చేపట్టాలని లేకుంటే గ్రామస్తుల సహకారంతో భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. – చందుర్తి(వేములవాడ)