వేములవాడ: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం వేములవాడ రాజన్న ఆలయంలో రాజేశ్వరిదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
సీఎంను కలిసిన విప్
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై ఇటీవల శృంగేరి పీఠాధిపతులను కలిసివచ్చిన నేపథ్యంలో విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు విప్ తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఉన్నారు.
భీమేశ్వర సదన్‌లోకి ఈవో కార్యాలయం
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా భీమేశ్వర సదన్‌కు మా ర్చారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో), ఇంజనీరింగ్, అకౌంట్స్, పరిపాలన, లీజుల విభాగా లు, ఇతర విభాగాలు భీమేశ్వర సదన్‌కు తాత్కాలికంగా మారాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ఈవో కార్యాలయంలో అర్చకులు మంగళవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో రమాదేవి తమ విధులు ప్రారంభించారు. ఈ మార్పు ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకు కొనసాగనుందని, తద్వారా ఆలయ పరిపాలన సజావుగా కొనసాగుతుందని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఈవోను సత్కరించారు.
ఆయుర్వేద వైద్య శిబిరం
సిరిసిల్లటౌన్: ధన్వంతరి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మెగా క్యాంపు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా అధికారి డాక్టర్ శశిప్రభ, ఆయుర్వేద క్యాంప్ ఇన్‌చార్జి డాక్టర్ కళ్యాణి, వైద్యులు స్వరూప, స్వాతి, శ్వేత, డీపీఎంవో తిరుపతి, ఫార్మసిస్ట్ పుష్పలత, ప్రవీణ్, లావణ్య, ఎస్‌ఎన్‌ఓస్ సరోజ, జిల్లా యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకుడు బి.శ్రీనివాస్, టి.స్వప్న, కృష్ణ, రిషిక, అశోక్, పుష్పలత, శిరీష, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం మోతిలాల్, ఎన్జీవో అధ్యక్షుడు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య చర్యలు చేపట్టాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): పండుగల నేపథ్యంలో గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య చర్యలు తీసుకోవాలని డీఎల్‌పీవో వీరభ్రదయ్య అన్నారు. మంగళవారం ముస్తాబాద్ మేజర్ పంచాయతీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రధాన కూడళ్లతోపాటు, చెరువులు, వాగుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బతుకమ్మ ఆడే ప్రాంతంలో బురద లేకుండా చూడాలన్నారు. ఎంపీవో వాజిద్, ఈవో రమేశ్, సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో మోస్తరు వర్షం
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. వేములవాడలో అత్యధికంగా 25.8 మి.మీ పడగా, గంభీరావుపేట 24.7, ఎల్లారెడ్డిపేట 13.7, ఇల్లంతకుంట 11.4, రుద్రంగి 6.8, వేములవాడరూరల్ 6.5, సిరిసిల్ల 1.6, కోనరావుపేట 2.2, ముస్తాబాద్ 3.0, తంగళ్లపల్లి 2.9, వీర్నపల్లి 0.3 మి.మీ, చందుర్తి బోయినపల్లి మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు.

బ్రహ్మచారిణిగా అమ్మవారు