
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు మహేందర్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు మహేందర్ ఆర్చరీలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తీరందోళి (ఆర్చరీ) రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 22న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగాయి. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఓ కళాశాల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మహేందర్ జాతీయస్థాయి పోటీలకు శాతవాహన యూనివర్సిటీకి ప్రాతినిఽ ద్యం వహిస్తారు. అక్టోబర్ 23 నుంచి 26 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.
వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
సిరిసిల్లఅర్బన్: స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాల, సుందరయ్యనగర్‌లో నిర్వహించిన వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శిబిరాల్లో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య శిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయకసాగర్‌కు 3,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, 3.26 టీఎంసీల నీరు ఉంది.
బోయినపల్లి: మిడ్‌మానేరులోకి మంగళవారం 5,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి 4,500 క్యూసెక్కుల నీరు వరదకాలువ ద్వారా చేరుతోంది.

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు మహేందర్

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు మహేందర్

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు మహేందర్