అందరూ బాగుండాలి | - | Sakshi
Sakshi News home page

అందరూ బాగుండాలి

Sep 23 2025 11:10 AM | Updated on Sep 23 2025 11:10 AM

అందరూ

అందరూ బాగుండాలి

అందరూ బాగుండాలి అంబులెన్స్‌లు తనిఖీ భగవద్గీత పఠన పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపిక ఘనంగా ఆయుర్వేద దినోత్సవం పంచాయతీ కార్యాలయం ముట్టడి

వేములవాడ: అమ్మవారి దీవెనలతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని వేములవాడ రాజన్నను, అమ్మవారలను సోమవారం దర్శించుకున్నారు. ఏఈవో అశోక్‌, ఇతర అధికారులు ఉన్నారు.

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని 108 వాహనాలను ఈఏంఆర్‌ఏ గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రాష్ట్ర ఆడిటింగ్‌ అధికారి వెంకటేశ్‌ సోమవారం తనిఖీ చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలో నిలిపి ఉంచిన నియోనాటల్‌ అంబులెన్స్‌, 108 వాహనాలను తనిఖీ చేశారు, వెంటిలేటర్‌, మానిటర్‌, ఇన్ఫ్యూజన్‌ పంప్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సకు ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు, వాహనాలలోని రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోల్డెన్‌ అవర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. కార్యక్రమంలో 108 సిబ్బంది పెద్ది శ్రీనివాస్‌, బుర్ర స్వాతి, నునావత్‌ మదన్‌, బత్తుల రాజు, మామిడాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: చిన్మయ మిషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు బాలబాలికలకు నిర్వహిస్తున్న చిన్మయ గీతా పఠన పోటీలలో సిరిసిల్ల చిన్నారులు రాణించారు. కరీంనగర్‌లో నిర్వహించిన పోటీల్లో స్థానిక శ్రీసరస్వతీ శిశు మందిర్‌ విద్యార్థులు దూస రుత్విక్‌, కొయ్యడ స్వస్తిక్‌, కొక్కుల ప్రశస్త, మ్యాన శ్రీహిత, గాజుల తేజశ్రీ , చిన్మయ బాలవిహార్‌ నుంచి కుడిక్యాల తేజస్వి పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో మ్యాన శ్రీహిత, ప్రథమ, కుడిక్యాల తేజస్వి ద్వితీయ, గాజుల తేజశ్రీ తృతీయ స్థానాల్లో రాణించారు. మ్యాన శ్రీహిత నవంబర్‌ 9న కడపలో నిర్వహించే రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. వీరిని చిన్మయ మిషన్‌ సిరిసిల్ల అధ్యక్షుడు సజ్జనం శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లకావత్‌ మోతిలాల్‌, ఉపాధ్యక్షులు గజ్జెల్లి రామచంద్రం, శ్రీపతి కోటేశ్వరి, ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ అభినందించారు.

సిరిసిల్లటౌన్‌: పదో అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని సిరిసిల్లలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఆయుశ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీమార్కెట్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ శశిప్రభ, జిల్లా ప్రోగ్రాం అధికారి తిరుపతి, డాక్టర్‌ స్వరూప, డాక్టర్‌ స్వాతి, ఫార్మసిస్ట్‌ ప్రవీణ్‌, పుష్పలత, పీఎన్‌వో సరోజ, లావణ్య, యోగా శిక్షకులు బి.శ్రీనివాస్‌, టి.స్వప్న, ఎలిగేటి కృష్ణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెన్షన్‌దారులకు, వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, బీడీ కార్మికులు సోమవారం రాచర్లగొల్లపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు రూ.6వేలు, కొత్త పెన్షన్‌దారులకు రూ.4వేలు ఇవ్వాలని కోరారు. కార్యదర్శి రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అందె శామ్యూల్‌, అంజలి, నాగరాజు, అంజవ్వ, ఎల్లవ్వ, సునంద, రేణుక, నర్సయ్య, బాలయ్య పాల్గొన్నారు.

అందరూ బాగుండాలి
1
1/3

అందరూ బాగుండాలి

అందరూ బాగుండాలి
2
2/3

అందరూ బాగుండాలి

అందరూ బాగుండాలి
3
3/3

అందరూ బాగుండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement