
కలవారి కోడలు ఉయ్యాలో..
సిరిసిల్లటౌన్/వేములవాడ: బతుకమ్మ వేడుకలను జిల్లాలోని మహిళలు సంబురంగా నిర్వహించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు రాజన్న ఆలయంలో బతుకమ్మ ఆడా రు. ధర్మగుండంలో నిమజ్జనం చేశారు.
తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు
ఆత్మగౌరవానికి ప్రతీకై న బతుకమ్మను తెలంగాణ తల్లిచేతిలో లేకుండా రేవంత్‌రెడ్డి సర్కారు మాయం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలు, బోనాలను నెత్తిన పెట్టుకుని మహిళలు ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. వలసపాలనలో వివక్షకు గురైన బతుకమ్మ పండుగకు బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వం తరఫున ఆడపడుచులకు చీరెలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆడపడుచులకు ఇస్తామన్న రెండేసి చీరలు ఎటుపోయాయని ప్రశ్నించారు.

కలవారి కోడలు ఉయ్యాలో..