
వెంకన్న బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం పోలీస్, మున్సిపల్, వైద్యం, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. భక్తులకు వసతులు కల్పించాలని సూచించారు. మాడవీధుల్లో చలువ పందిళ్లు, మౌలిక వసతుల ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్లను డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితోపాటుగా ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా, ఆలయ ప్రధాన అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి, టీపీసీసీ కో–ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.