
కలెక్టరేట్‌లో జిమ్
రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌లో కొత్తగా జిమ్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆఫీస్ స్టాఫ్ మధ్యాహ్నం భోజనం చేసే ప్రదేశంలో అద్దాలతో కూడిన ప్రత్యేకమైన క్యాబిన్‌ను ఏర్పాటు చేసి జిమ్ పరికరాలు బిగించారు. ట్రేడ్‌మిల్, సైకిలింగ్ మిషన్‌తోపాటు మజిల్‌మిల్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు టేబుల్ టెన్నిస్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చొరవతో జిమ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. కలెక్టర్, అదనపు కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌ల్లో నివాసం ఉండే అధికారులు జిమ్ చేసుకునే అవకాశం ఉంది. – సిరిసిల్ల