పిక్కలు తీస్తున్న కుక్కలు | - | Sakshi
Sakshi News home page

పిక్కలు తీస్తున్న కుక్కలు

Sep 20 2025 6:54 AM | Updated on Sep 20 2025 6:54 AM

పిక్క

పిక్కలు తీస్తున్న కుక్కలు

జిల్లా ఆస్పత్రిలో నమోదైన కేసులు

రెచ్చిపోతున్న కుక్కలు

ఆరు నెలల్లో 885 కేసులు

వెంటాడి దాడిచేస్తున్న గ్రామసింహాలు

పట్టించుకోని అధికారులు

వెల్లువెత్తుతున్న విమర్శలు

సిరిసిల్లటౌన్‌: కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు దాడి చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ మనుషులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనాలపై వెళ్తున్న వారిని వెంబడిస్తూ పిక్కలు తీస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కరు వస్తే చాలు గుంపులుగా చేరి మీద పడుతున్నాయి. జిల్లాలో రెచ్చిపోతున్న కుక్కలపై ఫోకస్‌.

నియంత్రణ ఎక్కడ?

సిరిసిల్లతోపాటు జిల్లాలోని ఏ పల్లెలో చూసినా కుక్కలు రోడ్లపైన గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఆరు నెలల్లోనే జిల్లా ఆస్పత్రిలో 885 కుక్కకాటు కేసులు నమోదుకావడాన్ని పరిశీలిస్తే జిల్లాలో కుక్కల స్వైరవిహారం ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా వీధికుక్కల దాడులను నిలువరించే వారు లేరని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. చాలా రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కుక్కకాటుకు సరైన కాలంలో ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాంతకమే. అధికారులు కుక్కల జనాభా నియంత్రణపై దృష్టి పెట్టకపోవడంతో వాటి సంతతి పెరిగిపోతోంది.

జాగ్రత్తలు.. చర్యలు

● కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని డిటర్జెంట్‌ లేదా డెటాల్‌ సబ్బుతో ఐదు నిమిషాలపాటు శుభ్రం చేయాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

● యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌(ఏబీసీ)లో భాగంగా జంతువుల కుటుంబ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

● ఏబీసీ ఏజెన్సీని నియమించి వీధికుక్కలు, కోతులు, ఇతర జంతువుల నియంత్రణ చర్యలు తీసుకోవాలి.

● కుక్క, కోతులు, రోడ్లపై తిరిగే జంతువులకు కుటుంబ నియంత్రణ చేస్తే మున్సిపల్‌ ద్వారా ఏజెన్సీకి ఫీజు చెల్లించే అవకాశం ఉంది. సదరు ఏజెన్సీ జిల్లాలో లేదన్న విమర్శలు ఉన్నాయి.

● హాస్టల్స్‌, రెస్టారెంట్లు, ప్రైవేటు హాస్టల్స్‌, ఫంక్షన్‌హాళ్లలో మిగిలిన ఆహారాన్ని ఎక్కడ పడితే అ క్కడ పడేయడంతో కుక్కల సంచారం పెరిగింది.

● పశువులకు ముందస్తుగా వ్యాక్సిన్‌ వేస్తే.. రేబిస్‌ వ్యాధి ఉన్న కుక్క కరిచినా వాటికి ఎలాంటి హాని జరుగదు.

ఫిబ్రవరి 132

మార్చి 118

ఏప్రిల్‌ 133

మే 107

జూన్‌ 92

జూలై 100

ఆగస్టు 102

సెప్టెంబర్‌ 101

పిక్కలు తీస్తున్న కుక్కలు1
1/1

పిక్కలు తీస్తున్న కుక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement