
ప్యాక్స్ పర్సన్ ఇన్‌చార్జి చైర్మన్‌గా తిరుపతిరెడ్డి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని గాలిపల్లి ప్యాక్స్ పర్సన్ ఇన్‌చార్జి చైర్మన్‌గా అన్నాడి అనంతరెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ పర్సన్ ఇన్‌చార్జి చైర్మన్‌గా రొడ్ల తిరుపతిరెడ్డిలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీసీవో రామకృష్ణ శుక్రవారం తెలిపారు. నిబంధనల ప్రకారం డిఫాల్ట్ ఆఫ్ లోన్స్ కింద ఇల్లంతకుంట ప్యాక్స్‌లో ఒకరిని, గాలిపల్లి ప్యాక్స్‌లో ఇద్దరిని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇల్లంతకుంటలో కార్యదర్శి రవీందర్‌రెడ్డి, పర్సన్ ఇన్‌చార్జి మెంబర్లు గొడుగు తిరుపతి, నరసింహారెడ్డి, గజ్జల సత్యం, కట్ట లచ్చయ్య, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.