
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి
జిల్లా ఆస్పత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కుక్కకాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా సత్వర చికిత్స కోసం సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధితులు నాటువైద్యం చేయించుకోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలి. కుక్కకాటుతో రేబిస్ వ్యాఽధి సోకకుండా టీటీ, ఏఆర్‌వీ, ఇమ్యూనోగ్లోబిలెన్స్ ఇంజక్షన్లు, ఇతర అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ క్రాంతికుమార్,
ప్రొఫెసర్ జనరల్ విభాగం