
బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాలి
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి
గంభీరావుపేట(సిరిసిల్ల): బడి పిల్లలు ఎంతో నైపుణ్యంతో రాసిన బాలసాహిత్యం ‘పెద్దబడిలో చిన్నపిల్లల కథలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేవీ రమణాచారి ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి బహుభాషవేత్త నలిమెల భాస్కర్‌తో కలిసి హాజరయ్యారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాగే కృషి చేస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆకాంక్షించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. కథలు రాసిన విద్యార్థులను, పుస్తక రూపకల్పనకు, రచనలకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులు వీఆర్ శర్మ, గరిపల్లి అశోక్, అంజన్‌రెడ్డి, దబ్బెడ హనుమాండ్లను అభింనందించారు. అనంతరం నారాయణపూర్ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో మార్గనిర్ధేశం చేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం తిరుమల మనోహరాచారి, ప్రాణహిత ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వేములవాడ: వేములవాడ సబ్‌కోర్డు ఏపీపీ(అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్)గా అవదూత రజనీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వేములవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో శుక్రవారం 3.27 టీఎంసీలకు నీరు చేరింది. అన్నపూర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి, అన్నపూర్ణ నుంచి రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.
సిరిసిల్లకల్చరల్: న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ జిల్లాలో అడ్వకేట్లు శుక్రవారం విధులు బహిష్కరించారు. నల్లరిబ్బన్లు ధరించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని కోరారు. నిరసనలో జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు తంగళ్లపల్లి వెంకటి, ఆవునూరి రమాకాంత్‌రావు, ఎస్.వసంతం, బి.రవీందర్‌రావు, అనిల్‌కుమార్, నర్సింగరావు, ధర్మేందర్, రాజమల్లు తదితర 100 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.
చందుర్తి(వేములవాడ): మండల కేంద్రం శివారులో వాహనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్టీ ఏ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. ప్యాసింజర్ ఆటోలను, వ్యాన్‌లు, మినీగూడ్స్, ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ధ్రువీకరణపత్రాలు సరిగా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తామని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్ తెలిపారు. ట్రెయినీ అధికారులు మనోజ్‌కుమార్, కానిస్టేబుల్ ప్రశాంత్ పాల్గొన్నారు.

బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాలి

బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాలి

బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాలి

బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాలి