
నిత్య సాధన చేయించాలి
● అప్పుడే విద్యార్థులు పట్టు సాధిస్తారు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల/కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులతో నిత్యం సాధన చేయిస్తేనే పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తారని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కోనరావుపేటలోని మోడల్ స్కూల్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. తరగతిగదులు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులను వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు.
స్పెషలిస్ట్ డాక్టర్లతో పరీక్షలు
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వస్త్ నారీ, స్వశక్తి పరివార్ అభియాన్‌లో చేపట్టిన వైద్యశిబి రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో పరీక్షలు చేయించాలని క లెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించా రు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబరు 17 నుంచి అ క్టోబర్ 2 వరకు జిల్లాలో 99 ఆరోగ్య వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, అనేమియా, టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలి పారు. జిల్లాలోని ప్రతీ గర్భిణీ వందశాతం ఏఎన్సీ చెకప్ చేయించుకునేలా చూడాలన్నారు. మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, సంపత్‌కుమార్, నయిమా జహా, రాజేందర్ పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాను రివిజన్ చేయాలి
ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్) చేపట్టాలని కలెక్టర్ కోరారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో పోల్చుతూ తప్పులను సరిచేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.