
పార్టీకి కార్యకర్తలే బలం
● బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు
కోనరావుపేట(వేములవా): పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. మండలంలోని మల్కపేటలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తులు ఎవరూ చెరుపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదితో ప్రభుత్వం ఏర్పాటు చేసి 22 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల హామీల అమలులో విఫలమవుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తమ పార్టీ కార్యకర్తలపై అనవసరపు కేసులు పెడుతున్నారన్నారు. ప్రెస్‌మీట్‌లలో మేము నిలదీస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారని.. ఇది మీ ప్రజాపాలన అని ఎద్దేవా చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ వైస్‌చైర్మన్ తిరుపతి, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, చంద్రయ్య, ప్రభాకర్‌రావు, రామ్మోహన్‌రావు, గోపు పర్శయ్య తదితరులు పాల్గొన్నారు.