
వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సిరిసిల్లటౌన్: ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కోన బాలశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని, వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. వెదురుతో తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోన శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బొల్లం రామ్‌సాగర్, జిల్లా ప్రచార కార్యదర్శి వేముల అంజయ్య, సిరిసిల్ల మండలాధ్యక్షుడు పోతు బాలయ్య, గంభీరావుపేట మండలాధ్యక్షుడు పోతు దేవయ్య, చందుర్తి మండలాధ్యక్షుడు రేషం రామస్వామి, రేషం శ్రీనివాస్, పోతు లక్ష్మీరాజం, ఇందూరి ఎల్లయ్య, బొల్లం రాజయ్య, అలిపిరెడ్డి బాలకృష్ణ, కనికరం రాజు, కనికరం రాజయ్య పాల్గొన్నారు.