
అమ్ముతాం ఆపేదెవరు !
● యథేచ్ఛగా నల్లబజారుకు పేదల బియ్యం
మర్రిపూడి: కూటమి నేతల కనుసన్నల్లో సాగుతున్న రేషన్ దుకాణాల నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. రేషన్‌దుకాణాల నిర్వాహకులు పేదల నుంచి ప్రతినెలా ఇంటికి సైతం వెళ్లి వేలుముద్రలు సేకరించి బియ్యం పంపిణీ చేయకుండా వారికి కిలో బియ్యం రూ.10 వంతున చెల్లిస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని రాత్రిపూట లారీలుపెట్టి దుకాణంలోని సరుకును లోడ్‌చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. విషయం అంతా తెలిసినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మర్రిపూడి మండలంలో 24 చౌకదుకాణాలు ఉండగా, 13,114 రేషన్‌కార్డులు ఉన్నాయి. సుమారు 39,342 టన్నుల బియ్యం, 6 వేల టన్నుల చక్కెర రేషన్ దుకాణాలకు ప్రతి నెలా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో 80 శాతం బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 4, 5 తేదీల్లో మర్రిపూడిలో 2వ నంబరు దుకాణందారుని భర్త నేరుగా లారీని దుకాణం ఎదురు నిలిపి పేదలకు పంచాల్సిన సరుకును లారీలో నింపి బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. 15 వ తేదీ దాకా కార్డుదారులకు అమ్మాల్సిన బియ్యాన్ని ముందే స్టాక్‌ను ఎత్తి వేయడం గమనార్హం.

అమ్ముతాం ఆపేదెవరు !