12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి | - | Sakshi
Sakshi News home page

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి

Oct 7 2025 4:11 AM | Updated on Oct 7 2025 4:11 AM

12వ ప

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి 40 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య పంటకాల్వలో పడి బాలుడు మృతి

పెన్షనర్ల అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశంలో తీర్మానం

ఒంగోలు సబర్బన్‌: ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్‌సీని నియమించాలని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్ల అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. స్థానిక ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు బోడా అంకిరెడ్డి మాట్లాడుతూ పీఆర్‌సీని నియమించి ఐఆర్‌ను 30 శాతం ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో రెండింటిని వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌ అలవెన్స్‌, 11వ పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడతల వారీగా చెల్లించాలన్నారు. అన్ని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కార్డుపై అన్ని వ్యాధులకు క్యాష్‌లెస్‌ వైద్యం అందించాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కె.సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

పొన్నలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం వాహనాన్ని పొన్నలూరు పోలీసులు మూడు రోజుల కిత్రం పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులు గత శనివారం ముత్తరాసుపాలెం సమీపంలోని ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద ఓవీ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తేండగా కనిగిరి నుంచి కందుకూరు వైపు మినీ ట్రక్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై అనూక్‌ తెలిపారు. అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యం బస్తాలను స్థానిక రేషన్‌ షాపుకు తరలించారు.

వెలిగండ్ల(కనిగిరిరూరల్‌): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గోకులంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన ఎన్‌ సుజాత (35) ఇంట్లో ఎవ్వలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణపావని సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కంభం: కాలువలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కంభంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన బోధనం రవిశేఖర్‌ ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ తన కుమారుడు అశ్వంత్‌(12)ను పొలం పక్కనే పంట కాలువ గట్టుపై కూర్చొపెట్టాడు. కొద్ది సేపటి తర్వాత చూడగా పిల్లవాడు కనిపించకపోవడంతో పిల్లవాడు ఫిట్స్‌ వచ్చి కాలువలో పడిపోయినట్లు గుర్తించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన బాలుడి స్థితి మానసికంగా బాగాలేదని తెలిసింది.

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి 1
1/3

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి 2
2/3

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి 3
3/3

12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement