
సమాచార హక్కు చట్టంతో పారదర్శకత
ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతుందని సేంద్రియ వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ వి.సుభాషిణి అన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆ విభాగం అధికారులు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ ప్రతి పౌరుడు తనకు అవసరమైన సమాచారాన్ని పొందడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను ప్రోత్సహించవచ్చని చెప్పారు. క్యాడర్ సభ్యులు గ్రామస్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, ప్రజలకు అవగాహన పెంపు గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా టీమ్ సభ్యులు, క్లస్టర్ కో ఆర్డినేటర్లు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు: ౖబెక్ చోరీ కేసులో నిందితునికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు
ఎకై ్సజ్ మేజిస్ట్రేట్ ఎస్ కోమలవల్లి సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2022 ఆగస్టు 14వ తేదీ రాత్రి 10 గంటలకు సంతనూతలపాడు ఎన్‌ఎస్‌పీ కాలనీ నివాసి మందాడి సత్యన్నారాయణ తన ఇంటిముందు బైక్ పార్కు చేసి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం బైక్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఒంగోలు జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా నవీన్‌గా గుర్తించి ఆగస్టు 18న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ నవీన్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించారు. నిందితులకు శిక్ష పడడంలో కృషి చేసిన ఏపీపీ శ్రావణ్‌కుమార్, సంతనూతలపాడు ఎస్సై అజయ్‌బాబు, కోర్టు కానిస్టేబుల్ కె.వెంకట్రావులను ఎస్పీ హర్షవర్థన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.
సేంద్రియ వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ సుభాషిణి