
కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి
కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్
ఒంగోలు వన్‌టౌన్: కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ కోరారు. ఆదివారం ఒంగోలు వచ్చిన ఆయన ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొమ్మరులను గిరి బలిజగా మారుస్తూ ఇచ్చిన జీఓను స్టేటస్ కో ఇచ్చారన్నారు. దశాబ్ద కాలంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేయాలన్నారు. కాపు సమస్యలు అనేకం పరిష్కారం కాకుండా ఉంటే, ప్రభుత్వ పెద్దలు నూతన సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు కే సంజీవ్ కుమార్, పీ రాజ్య సులోచన, ఎన్ హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.