
కౌశల్ పోటీలను విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కౌశల్ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని డీఈఓ కిరణ్‌కుమార్ కోరారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కౌశల్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
స్కూల్ లెవెల్ పరీక్షలో..
● క్విజ్ పోటీలకు అర్హత 8, 9, 10వ తరగతి విద్యార్థులు, విద్యార్థుల సంఖ్య తరగతికి ముగ్గురు మాత్రమే ఉండాలి.
● రీల్ పోటీలకు పదో తరగతి విద్యార్థులు పాల్గొనాలి.
● పోస్టర్ కాంపిటీషన్–1 పోటీలకు అర్హత 9వ తరగతి,
ఇద్దరు మాత్రమే ఉండాలి.
● పోస్టర్ కాంపిటీషన్–2 పోటీలకు అర్హత 8వ తరగతి,
ఇద్దరు మాత్రమే ఉండాలి.
క్విజ్, రీల్ కాంపిటీషన్, పోస్టర్ కాంపిటీషన్‌లో పాల్గొనే విద్యార్థులు స్కూల్ లెవెల్లో ఆన్‌లైన్ పరీక్ష రాయాలి. పైన తెలిపిన పోటీల్లో పాల్గొనే విద్యార్థులు సిలబస్ కోసం క్విజ్ పోటీలకు ఎస్సీఈఆర్టీ అక్టోబర్ వరకు, రీల్ పోటీలకు ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ వెబ్ సైట్‌లో, పోస్టర్ కాంపిటేషన్ పోటీలకు భారత దర్శన్ మెటీరియల్లో చూడాలి. స్కూల్ లెవెల్ ఎగ్జామ్‌లో ప్రతి తరగతి నుంచి క్విజ్‌కు 20 మంది విద్యార్థులు, రీల్‌కు 20 మంది విద్యార్థులు, పోస్టర్–1కు 20 మంది విద్యార్థులు, పోస్టర్–2కు 20 మంది విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయికి ఎంపికై న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. రాష్ట్రస్థాయికి ప్రతి జిల్లా నుంచి క్విజ్ పోటీలకు ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు, 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు పాల్గొంటారు. రీల్ కాంపిటీషన్‌కు 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు, పోస్టర్ కాంపిటీషన్–1కు 9వ తరగతి విద్యార్థులు విద్యార్థులు, పోస్టర్ కాంపిటీషన్–2కు 8వ తరగతి విద్యార్థులు ఇద్దరు ఎంపికవుతారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు వారి విభాగాల్లో ముఖాముఖి పోటీలు జరుగుతాయి. స్కూల్ లెవెల్లో పరీక్షలు 8వ తరగతి నవంబర్ 1, 9వ తరగతి–నవంబర్ 3, పదో తరగతి– నవంబర్ 4వ తేదీల్లో జరుగుతాయి. జిల్లా స్థాయి పరీక్షలు 8వ తరగతి, 9వ తరగతికి నవంబరు 27న, 10వ తరగతికి నవంబరు 28న పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27 తిరుపతిలో భారతీయ విజ్ఞాన జాతీయ సమ్మేళనంలో జరుగుతాయని డీఈఓ కిరణ్‌కుమార్ వివరించారు. డీవైఈఓ చంద్రమౌలేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, గుడివాడ శ్రీనివాసరావు, నాగినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
డీఈఓ కిరణ్‌కుమార్