
ఆర్భాటం తప్ప..సాయం అంతంత మాత్రమే
ఒంగోలు సబర్బన్: ఆటో డ్రైవర్ సేవ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంటే జిల్లా కేంద్రం ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమానికి కనీసం 400 ఆటోలు కూడా రాలేదు. జిల్లా వ్యాప్తంగా 11,356 మంది ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమాన్ని అందిస్తుంటే కనీసం 400 ఆటోలు కూడా రాలేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ మంత్రి మండిపడ్డారు. ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమం శనివారం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మెగా చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. అర్హత ఉన్న ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.15 వేలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, డీటీసీ ఆర్.సుశీల, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో
ఇన్‌చార్జి మంత్రి అసహనం
లబ్ధిదారులు తక్కువ మంది
హాజరు కావడంపై ఆగ్రహం