
అమ్మకానికి ప్రభుత్వ స్థలాలు
పట్టణంలోని నల్లబండబజారు, రాజానగర్, శ్రీరామ్‌నగర్, నరసింహస్వామిమెట్ల రోడ్డు, హోసన్న మందిరం రోడ్డుల్లోని కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాచేసి అక్రమ కట్టడాలు చేపట్టి అమ్మకాలు జోరుగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. కొండపోరంబోకు స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలకు ఇతర సర్వే నంబర్లు వేసి ఆ సర్వే నంబర్‌లో ఇంటి నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్ శాఖ నుంచి పన్ను రసీదులు పుట్టించుకుని దాని ఆధారంగా అమ్మకాలు కొనసాగిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు.