
వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్లుగా నియామకం
కనిగిరిరూరల్: పార్టీలో నిబద్ధతగా, అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నత స్థానం కల్పించారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు. కనిగిరి నియోజకవర్గానికి చెందిన చింతలచెరువు సత్యన్నారాయణరెడ్డిని సీఈసీ మెంబర్‌గా నియమించారు. ఆయన గతంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకునిగా, 2024 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ పరిశీలకుడిగా, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. తన నియామకం పట్ల చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి
మార్కాపురం: వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యునిగా ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని నియమించారు. జంకె వెంకటరెడ్డి రెండు సార్లు మార్కాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ పరిశీలకునిగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన పై ఎంతో నమ్మకంతో అప్పగించిన ప్రతి పదవిని బాధ్యతగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని జంకె వెంకటరెడ్డి తెలిపారు.
కొండపి నుంచి డాక్టర్ మాదాసి వెంకయ్య
సింగరాయకొండ: కొండపి నియోజకవర్గానికి చెందిన మాజీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్, పీడీసీసీబీ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్లుగా నియామకం

వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్లుగా నియామకం