
గాంధీజీ మార్గం అనుసరణీయం
ఒంగోలు సబర్బన్: జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తిత్వం, ఆయన చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని కలెక్టర్ పీ రాజాబాబు అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు గాంధీరోడ్డులోని గ్రామచావిడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల జయంతులు నిర్వహించుకోవడం మనందరి అదృష్టమన్నారు. వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామచావిడిని పునర్నిర్మిస్తున్నామని, ఇది అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 10 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, బీఎన్ విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత పాల్గొని గ్రామ చావిడి పునర్నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గాంధీజీకి వైఎస్సార్ సీపీ నాయకుల నివాళులు...
ఒంగోలు సిటీ: స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు, రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ అశోక్, రాష్ట్ర ఇంటలెక్చువల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, నాయకులు సయ్యద్ అప్సర్, షేక్ మీరావాలి, వీసం బాలకృష్ణ, పిగిలి శ్రీనివాసరావు, షేక్ జిలానీబాషా, ఫణిదపు సుధాకర్, డివిజన్ అధ్యక్షులు రాజేష్, భాస్కర్, గళ్లా దుర్గా, పార్టీ నాయకులు వేముల శ్రీకాంత్, వెంకయ్య నాయుడు, పెట్లూరి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.