
బహిరంగంగానే మాంసం అమ్మకాలు...
గాంధీ జయంతి రోజు జిల్లాలో బహిరంగంగానే మాంసం అమ్మకాలు జరగాయి. నగరంలోని 60 అడుగుల రోడ్డు, నెల్లూరు బస్టాండు సెంటర్, అద్దంకి బస్టాండ్ సెంటర్, కర్నూలు రోడ్డు, గుంటూరు రోడ్లలో బిర్యానీ సెంటర్లను వ్యాపారాలు నిర్వహించుకోవడం కనిపించింది. ఇక, చికెన్ పకోడా సెంటర్లయితే లెక్కేలేదు. చికెన్ దుకాణాలు మూసివేసినప్పటికీ బిర్యానీ హోటళ్లకు చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేనాథుడే లేడు. ఒంగోలు నగరం పాతమార్కెట్ సెంటర్, ఊరచెరువు రోడ్డు, కొత్త కూరగాయల మార్కెట్‌లో చికెన్, మటన్ అమ్మకాలు జోరుగా సాగాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.