
త్రై లోక్య మాతా.. ధన్‌యోస్మి
యర్రగొండపాలెం/మార్కాపురం టౌన్: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం యర్రగొండపాలెంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు విజయ ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రూ.27 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో నిర్వాహకులు అలంకరించగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శమిపూజ అనంతరం మహిషాసురమర్దినిగా అమ్మవారిని
అలంకరించి రథోత్సవం నిర్వహించారు. అలాగే మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి వద్ద
ముద్దసానమ్మ ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ
ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిగ్రహ మూర్తిని రూ.24,11,116 విలువైన కరెన్సీ నోట్లతో
అలంకరించి పూజలు చేశారు.

త్రై లోక్య మాతా.. ధన్‌యోస్మి