
‘ప్రకాశం’ పేరును నిలబెడదాం
● ఆయుధ పూజలో ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: ప్రశాంత వాతావరణానికి నిలయమైన ప్రకాశం జిల్లా పేరును నిలబెట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు పిలుపునిచ్చారు. విజయ దశమి పండగను పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలంలో శాస్త్రోక్తంగా ఆయుధపూజ నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో సతీసమేతంగా ఎస్పీ పూజలు చేశారు. నిత్యం పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆయుధాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు , సిబ్బంది పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, తాలుకా సీఐ విజయకృష్ణ, మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, సీసీఎస్ సీఐ జగదీష్, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: గంజాయి, ఇతరా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి చేసే నేపథ్యంలో జిల్లా పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలోని పార్శిల్ కార్యాలయంలో అనుమానాస్పద బుకింగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన స్లీపర్ డాగ్ రాక్సీతో కలిసి బస్సులు, రైళ్లలోని ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. తనిఖీలకు నేతృత్వం వహించిన వన్‌టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. గంజాయి రవాణాను కట్టడి చేయడానికి ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణా విషయంలో నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేదిత వస్తువులకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 91211 02266కు తెలియజేయాలని కోరారు.

‘ప్రకాశం’ పేరును నిలబెడదాం