
కారు ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు
కనిగిరిరూరల్: బైక్‌ను కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కనిగిరి పొగాకు బోర్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..పెదారికట్లకు చెందిన ఎస్‌కే ఖదీర్ స్కూటీపై కనిగిరి వైపు వస్తున్నాడు. ఆ సమయంలో కనిగిరి నుంచి పొదిలి వైపుకు వేగంగా వస్తున్న కారు పొగాకు బోర్డు యార్ట్ వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ బైక్ ఉన్న ఎస్‌కే ఖదీర్‌కు తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. స్కూటీని ఢీకొన్న కారును గడ్డమీదపల్లి వద్ద స్థానికులు అడ్డుకుని ఆపినట్లు తెలిసింది. క్షతగాత్రుడు ఖదీర్ మంగళవారమే బెంగుళూరు నుంచి వచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.