
● డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
కురిచేడు: వినుకొండ నుంచి పొదిలి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రీనివాసరావు బస్సును నిలిపి ప్రయాణికులను దింపేశారు. వివరాలు.. వినుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 29జెడ్ 0472 నంబర్ గల బస్సు మంగళవారం వినుకొండ నుంచి పొదిలి వెళ్తోంది. మండలంలోని బోధనంపాడు వద్ద ఇంజిన్‌లో మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును పక్కకు తీసి నిలిపేశాడు. ప్రయాణికులను బస్సు నుంచి దింపి ప్రమాదం జరగకుండా కాపాడాడు. ప్రయాణికులను వెనుక వచ్చిన బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. కాలంతీరిన బస్సులు నడపడం వల్లే ఇల్లా జరుగుతోందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.