
ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: బాధితుల సమస్యలు పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, బాధితులు ముఖాల్లో సంతోషం కనిపిస్తుందని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు వచ్చా యి. ఎస్పీ వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..వేదికలో వచ్చిన ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అదేశించారు. నిర్ణీత గడువు లోగా సమస్యల ను పరిష్కరించాలని చెప్పారు. వికలాంగులు, వృద్ధు లు, మహిళల సమస్యలను సత్వరమే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీస్‌స్టేషన్లలో కానీ, సబ్ డివిజన్లలో కానీ ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. మహిళా పోలీసు డీఎస్పీ వీవీ రమణకుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు, పొది లి సీఐ వెంకటేశ్వర్లు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.