
సెపక్ తక్రా విజేతలు.. తూర్పుగోదావరి, శ్రీకాకుళం
ఒంగోలు: సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు, మహిళల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో కర్నూలు జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో, ప్రకాశం, అనంతపురం జిల్లాల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో, కోనసీమ అంబేడ్కర్, తూర్పుగోదావరి జిల్లా జట్లు తృతీయ స్థానం సాధించాయి. స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించిన 35వ రాష్ట్ర స్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, సెపక్ తక్రా జిల్లా చైర్మన్ డాక్టర్ కృష్ణసాయి, కార్యదర్శి డి.రవిప్రసాద్, శాప్ కోచ్ పి.వేణు, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

సెపక్ తక్రా విజేతలు.. తూర్పుగోదావరి, శ్రీకాకుళం