
బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!
లోపల, బయట ప్రయాణికులతో నిండిపోయిన ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్
అధిక సంఖ్యలో బస్సు ఎక్కుతున్న మహిళలు
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో బస్సులెక్కాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికులకు సరిపడా సర్వీసులు ఏర్పాటు
చేయకుండానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం
కల్పించడంతో జిల్లాలో అరకొరగా నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో జిల్లాలోని ప్రయాణికులకు బస్సులెక్కడం అనేది ఒక సవాలుగా
మారింది. ఒకవేళ ఎలాగోలా అష్టకష్టాలుపడి తోటివారిని తోసుకుంటూ బస్సు ఎక్కినా సీటు దొరకడం గగనమైంది. ఈ రెండూ సజావుగా జరిగి గమ్యస్థానానికి చేరితే ఆ రోజుకి గండం గట్టెక్కినట్లే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు అన్ని
పట్టణాల్లోని బస్టాండ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతరత్రా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం, శనివారం నుంచి కళాశాలలకు కూడా సెలవులు కావడంతో ఒక బస్సు వస్తే ఎక్కేందుకు 120 నుంచి 150 మంది వరకూ
ప్రయాణికులు పోటీపడుతున్నారు. ప్రభుత్వం బస్ సర్వీసులు
పెంచకపోవడంతో వచ్చిన బస్సు మిస్సయితే మళ్లీ బస్సు ఉంటుందో ఉండదో తెలియక ఎలాగైనా అదే బస్సు ఎక్కాలనే ప్రయత్నంలో
తీవ్రంగా తోసుకుంటున్నారు. బస్సులో సీట్ల కోసం పోటీపడే క్రమంలో ఏకంగా ప్రయాణికుల మధ్య వాదనలు, ఘర్షణలు
చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియా ట్రోల్ కూడా అవుతున్నాయి. దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేయకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– సాక్షి, ఒంగోలు
సీట్ల కోసం పాట్లు
బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!

బస్సులెక్కగలవా.. ఓ నరుడా..!