
రాయలసీమ వెళ్లే వాహనాల దారి మళ్లింపు
● బైర్లూటి చెరువు నిండి
రోడ్లపై నీరు పారుతుండటంతో డైవర్షన్
పెద్దదోర్నాల: మండల కేంద్రం నుంచి రాయలసీమ వైపునకు వెళ్లే వాహనాలను అధికారులు శనివారం దారి మళ్లించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని బైర్లూటి వద్ద ఉన్న సిద్ధాపురం చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయింది. దీంతో అధికారులు చెరువు అలుగు ద్వారా వరద నీటిని వదలడంతో రోడ్డుపై భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రహదారిని మూసివేయడంతో మండల కేంద్రం మీదుగా రాయలసీమ వైపు వెళ్లే అన్ని వాహనాలను దారి మళ్లించారు. గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలు, తదితర ప్రాంతాల మీదుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ఐనముక్కల వద్ద ఏఎస్సై కృష్ణమూర్తి, రైటర్ మోహన్ పర్యవేక్షించారు.

రాయలసీమ వెళ్లే వాహనాల దారి మళ్లింపు