బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..! | - | Sakshi
Sakshi News home page

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!

Sep 27 2025 6:46 AM | Updated on Sep 27 2025 6:46 AM

బౌద్ధ

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!

జిల్లాలో ప్రాచీన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న బౌద్ధ స్థూపం గురించి పట్టించుకునే వారు లేక శిథిలావస్థకు చేరింది. దొనకొండ మండలంలోని చందవరం సమీపంలో ఉన్న ఈ బౌద్ధ స్థూపం సుమారు 50 సంవత్సరాల క్రితం వెలుగుచూసింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన ఆధారాలను పరిశీలిస్తే బౌద్ధ విశ్వవిద్యాలయం, 60 ఎకరాలలో బౌద్ధ విహారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అశోకుని కాలానికి ముందే నిర్మించిన స్థూపమని, అమరావతి స్థూపంకన్నా పెద్దదని, నాగార్జున కొండలోని స్థూపాలకన్నా ముందుదని భావిస్తున్నారు. మండల సరిహద్దు జగన్నాథపురం రెవెన్యూ గ్రామ పరిధిలో గుండ్లకమ్మ నది ఒడ్డున 1965వ సంవత్సరంలో బయటపడిన ఈ బౌద్ధ స్థూపం రాష్ట్రంలోనే పెద్దదిగా పేర్కొంటారు. శింగరకొండ నుంచి దక్షిణాన గల కాంచీపురం వెళ్లే ప్రాచీన రహదారిపై ఉండగా, రెండో శతాబ్ధంలో శాతవాహన పాలనలో ఈ స్థూపాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సుమారు 800 సంవత్సరాల పాటు ఇది ప్రముఖ బౌద్ధ ధార్మిక కేంద్రంగా, బౌద్ధ విశ్వవిద్యాలయంగా విరాజిల్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో వెలుగొందే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టక కళావిహీనంగా మారింది. దశబ్ధాలుగా కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 2022లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి పూర్వ వైభవం ఉట్టిపడేలా చర్యలు చేపట్టారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యాటక శాఖాధికారులు పర్యవేక్షణా లోపం కారణంగా కనీసం కేర్‌ టేకర్‌ కూడా లేకపోవడంతో బౌద్ధ స్థూపం గోడలపై గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగాయి. గోడల మధ్య ఇటుక రాళ్లు ఊడిపోతున్నాయి. స్థూపం వద్దకు వెళ్లే దారి కూడా అధ్వానంగా ఉంది. మెట్లకు రాళ్లన్నీ పగిలిపోయి సందర్శకులు వెళ్లేందుకు కూడా దారి లేకుండా పోతోంది. ఇలాగే వదిలేస్తే భావితరాలకు ఫొటోల్లో మాత్రమే చూపించాల్సిన దుస్థితి నెలకొంది. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా.. జిల్లాలో ఎంతో ఘన చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం గురించి పాలకులు, అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

– సాక్షి, ఒంగోలు

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..! 1
1/3

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..! 2
2/3

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..! 3
3/3

బౌద్ధ స్థూపానికి బాగోగులు కరువు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement