
సైకో అంటే గుర్తుకొచ్చేది బాలకృష్ణే
మార్కాపురం: శాసనసభలో గురువారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సైకో అంటూ విమర్శించడం మంచిపద్ధతి కాదని, సైకో అంటే గుర్తుకొచ్చేది బాలకృష్ణేనని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జి. శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం బాధకలిగిస్తోందన్నారు. బాలకృష్ణ వద్దకు ఎవరైనా అభిమానులు వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే చెంపలు పగులకొడతారన్నారు. ఒక్కో సారి దాడి కూడా చేస్తారన్నారు. గతంలో మీ ఇంట్లో కాల్పుల ఘటన ఎందుకు జరిగిందో.. ఎలా జరిగిందో.. మాకు తెలీదుకానీ జరిగిన సంఘటన వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్సార్ వద్దకు మీ కుటుంబం అంతా వెళ్లి సమస్యను వివరించడంతో ఆయన పెద్ద మనసుతో పరిష్కారం చేసిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. ఆ తర్వాత ఒక డాక్టర్ ద్వారా మెంటల్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఎన్‌టీ రామారావు సొంత జిల్లా కృష్ణ జిల్లాకు ఆయన పేరు పెట్టకపోతే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ పేరుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ వస్తే తాము చూస్తూ ఊరుకోమని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇంటలెక్చువల్స్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, మార్కాపురం నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు జంకె కృష్ణారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, పబ్లిసిటీ ప్రచార కార్యదర్శి సింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి నాలి కొండయ్య యాదవ్, వార్డు ఇన్‌చార్జి ఉత్తమ్‌కుమార్, మార్కాపురం యూత్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, పొదిలి ప్రచార కమిటీ అధ్యక్షుడు డేగ వెంకటరావు, జిల్లా స్టూడెంట్ సెక్రటరీ గుంటక అంజిరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి