
వైఎస్సార్ సీపీ వర్గీయులు బెయిల్‌పై విడుదల
ఒంగోలు టౌన్: వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన ఊరేగింపులో జరిగిన తోపులాట విషయంలో ఒంగోలు 45వ డివిజన్‌కు చెందిన గణేష్ భక్తులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న మూరక నారాయణరెడ్డి, భూమిరెడ్డి తిరుపతిరెడ్డి, తమ్మినేని సిద్దారెడ్డి శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వారిని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు మాల్యాద్రిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజేష్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మలిశెట్టి దేవా జిల్లా జైలు వద్దకు వెళ్లి కలిసి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చుండూరి రవిబాబు భరోసా ఇచ్చారు.
పరామర్శించిన చుండూరి రవిబాబు, నాయకులు