
ఇన్‌చార్జి వీఆర్‌ఓగా బాలేశ్వరరావు తొలగింపు
యర్రగొండపాలెం: మండలంలోని కొలుకుల పంచాయతీ ఇన్‌చార్జి వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న కర్రె బాలేశ్వరరావును తొలగించి బోయలపల్లి వీఆర్వో ఓబయ్యను ఇన్‌చార్జి వీఆర్వోగా నియమించినట్లు తహసీల్దార్ మంజునాథరెడ్డి తెలిపారు. గంగపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న బాలేశ్వరరావు తన స్వగ్రామమైన కొలుకుల ఇన్‌చార్జిగా వేయించుకున్నాడు. నియోజకవర్గ పచ్చ నేత అండతో ఓ వర్గాన్ని రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నాడని, ఈ విషయంపై 3 నెలల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో ఆ గ్రామస్తుల ఆవేదన బుధవారం సాక్షి దినపత్రికలో శ్రీపైసలిస్తేనే పని.. ప్రత్యర్థులకు వేధింపులుశ్రీ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ స్పందించారు. బాలేశ్వరరావును తన స్వగ్రామం నుంచి ఇన్‌చార్జి వీఆర్వోగా తొలగించి మరో వీఆర్వోను నియమించారు. దీంతో కొలుకుల గ్రామస్తులు తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవన్‌లో శాశ్వత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను గురువారం ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూంను డీఆర్‌ఓ బీసీహెచ్ ఓబులేసు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన సేవలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి టి.రవి, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సూపరింటెండెంట్ సీహెచ్ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
గిద్దలూరు రూరల్: గుర్తు తెలియని ఓ తల్లి తన పేగు బంధాన్ని వద్దనుకొని పురిటిబిడ్డను స్థానిక వైద్యశాలలో వదిలివెళ్లిన విషయం తెలిసిందే. ఈ మగ శిశువును పట్టణంలోని చిన్నపిల్లల వైద్యశాలల్లో రెండు రోజుల పాటు చికిత్స అందించారు. అనంతరం బిడ్డ తల్లి కోసం ఎంత గాలించినా కనిపించలేదు. దీంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి ఆ చిన్నారిని ఒంగోలు బాలసదన్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి దినేష్‌కుమార్‌కు అప్పగించారు.
చీమకుర్తి రూరల్: రామతీర్థం జలాశయం నుంచి ఒంగోలు వెళ్లే ఎన్‌ఎస్పీ కాలువలో తూర్పు బైపాస్ జంక్షన్లో ఏలూరివారిపాలెం లాకులు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్సై కథనం ప్రకారం..మృతుని వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహం కుడిచేతిపై అమ్మానాన్న, కుడిచేతి మణికట్టు వద్ద నాని అని పచ్చుబొట్టు ఉంది. మృతుని వివరాలు తెలిస్తే చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

ఇన్‌చార్జి వీఆర్‌ఓగా బాలేశ్వరరావు తొలగింపు

ఇన్‌చార్జి వీఆర్‌ఓగా బాలేశ్వరరావు తొలగింపు