
కలిసి పుట్టారు..కలిసిపోయారు
వాళ్లిద్దరు కవలలు. ఒకే రూపం. పుట్టకలాగే ఏం చేసినా ఒక్కటిగానే. కలిసి పాఠశాలకు వెళతారు. కలిసి చదువుకుంటారు. ఆడినా, పాడినా కలిసే ఉంటారు. వారిని చూసి విధికి కూడా కన్నుకొట్టిందేమో. ఇద్దరినీ ఒకేసారి తీసుకువెళ్లిపోయింది. ఆ ఇద్దరూ మృత్యువులోనూ విడిపోకుండా కలిసి వెళ్లిపోయారు. ఈ హృదయ విధారకర సంఘటన దర్శి మండలం చలివేంద్ర గ్రామంలోని జగనన్న కాలనీలో జరిగింది. దసరా సెలవులకు విజయవాడ నుంచి అమ్మమ్మ ఊరికి వచ్చిన నిఖిల్, అఖిల్ నీటి కుంటలో పడి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగావిలపించారు.
–దర్శి

కలిసి పుట్టారు..కలిసిపోయారు