
పశుపోషకుల పరిస్థితి దయనీయం..
రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాడిలో ముందంజలో ఉంటుంది. జిల్లాలో పాడిపై ఆధారపడి జీవించే రైతులు అధికం. అయితే పాడికోసం పెంచుతున్న పచ్చగడ్డికి కేవలం యూరియా మాత్రమే వాడతారు. యూరియా వేస్తేనే మేత త్వరగా పెరిగి కోతకు వస్తుంది. అయితే ప్రస్తుతం యూరియా అందుబాటులో లేకపోవడంతో పశువుల గడ్డి పెంచే పశుపోషకులు ఏం చేయాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడా బస్తా యూరియా కూడా ప్రస్తుతం అందని పరిస్థితి. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.