
ఎయిర్‌పోర్టు భూముల పరిశీలన
కొత్తపట్నం: మండల పరిధిలో అల్లూరు ఆలూరు మధ్యలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూములను కలెక్టర్ పి.రాజాబాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే 700 ఎకరాలను గుర్తించామని, అవసరమైతే వెంటనే సేకరిస్తామని చెప్పారు. అనంతరం ఆలూరు–అల్లూరు మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించారు. కలెక్టర్ వెంట జేసీ జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ శాంతికుమారి, సర్వేయర్ సుధీర్‌బాబు, ఆర్‌ఐ వరకుమార్, సిబ్బంది ఉన్నారు.
తాళ్లూరు: మండలంలో జరుగుతున్న బెంగళూరు ఎక్స్‌ప్రైస్ హైవే పనులను కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ ఆర్ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను నిర్దేశించిన సమయం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో సమావేశమయ్యారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే పీడీ అనీల్‌కుమార్, తహసీల్దార్ బీవీ రమణారవు, ఎంపీపీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ యడమకంటి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకారెడ్డి పాల్గొన్నారు.