
ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలు
కంభం: ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తుడిమెళ్ల గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..బేస్తవారిపేట గ్రామానికి చెందిన ఈ.బాలగురుమూర్తి ఆటోలో ఏడుగురు కూలీలు వ్యవసాయ పనులు చేసేందుకు తుడిమెళ్ల గ్రామానికి వెళుతున్నారు. ఆటో ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు మలుపు వద్ద రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాలగురుమూర్తితో పాటు ఆకుల నారాయణమ్మ, షేక్.మీరాభి, మహలక్ష్మిలకు తీవ్రంగా గాయాలు కాగా మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలు