గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

Sep 25 2025 7:07 AM | Updated on Sep 25 2025 7:07 AM

గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 – IIలో.. మొక్కలు నాటకుండానే...

ఉపాధి హామీలో విచ్చలవిడిగా అవినీతి ఒక్క పెద్దారవీడు మండలంలో రూ.6 కోట్ల మేర అక్రమాలు నామమాత్రంగా సామాజిక తనిఖీలు జరిమానాలతో సరిపెడుతున్నట్టు ఆరోపణలు అమెరికాలో ఉన్నవారికి, మరణించిన వారికి మస్టర్లు తీరుమారని ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది పనితీరు

న్యూస్‌రీల్‌

మరణించిన వారిపేరు మీద మస్టర్లు...

దర్శి మండలంలో చందలూరు, వెంకట చల్లంపల్లి, పోతవరం, మారెడ్డిపల్లి, బసివిరెడ్డిపల్లి, భీమవరం, తూర్పు వెంకటాపురం, జముకులదిన్నె, పొతకమూరు తదితర గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు తనిఖీ అధికారులు నిర్ధారించారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటకుండా, పంట కాల్వలు నిర్మాణం చేయకుండానే బిల్లు చేసుకొని లక్షల కొల్లగొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. పెద్దారవీడు మండలంలోని అన్నీ పంచాయతీల్లోనూ ఇదే తరహాలో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం 19 పంచాయతీలు ఉండగా అధికార పార్టీ నాయకులు, సిబ్బంది కూడబలుక్కొని అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. యర్రగొండపాలెం మండలంలో టీడీపీ ఇన్‌చార్జి అనుచరులు జాబ్‌ కార్డుకు వంద రూపాయల ప్రకారం వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఉపాధి హామీ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడబలుక్కొ మేసినోడికి మేసినంత అన్నట్లు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపేరు మీద మస్టర్లు వేయడం, చనిపోయిన వారి పేరుమీద కూడా మస్టర్లు వేసి అందిన కాడికి సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఈ పథకం ద్వారా నాటిన చెట్లకు పండ్లు కాయలు కాయడంలేదు కానీ అధికారుల జేబులు నిండుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. అక్రమాలను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలు సైతం ప్రహసనంగా సాగుతుండడంతో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 4.41 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. అందులో 3.82 లక్షల కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. 8.13 లక్షల మంది కూలీలు ఉండగా, వీరిలో 6.78 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు. ఉపాధి హామీ నిధులతో సీసీ, బీటీ రోడ్ల పనులు, గోకులం షెడ్లు, పచ్చ గడ్డి పెంపకం, ఇంకుడు గుంతల పనులన్నీ అధికార కూటమి నేతలు తమకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ మండలంలో చూసినా కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అధికారులు, కలెక్టర్‌ ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. డ్వామాలో సామాజిక తనిఖీల డ్రామా కొనసాగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సిబ్బంది అవినీతిని స్వయంగా జిల్లా అధికారులే కాపుకాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెరవెనుక డీల్‌ చేసుకొని జరిమానాలతో సరిపుచ్చుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రూ.6 కోట్లకు పైగా అవినీతి...

జిల్లాలో నిరంతరాయంగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాట వినని ఉద్యోగులను లొంగదీసుకోవడానికి సామాజిక తనిఖీలను ఆయుధంగా ప్రయోగిస్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దర్శి, పెద్దారవీడు మండలాల్లో జరిగిన సామాజిక తనిఖీలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దారవీడు మండలంలో జరిగిన అవినీతిపై పెద్ద దుమారం రేగింది. ఈ మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల్లో ఏకంగా రూ.6 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో గుర్తించారు. మొత్తం 637 పనులు చేసినట్లు రికార్డుల్లో చూపెడుతున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ నాయకులు, ఉపాధి సిబ్బంది కలిసి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినప్పటికీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. అలాగే దర్శి మండలంలో జరిగిన ఉపాధి పనుల మీద ఇటీవల సామాజిక తనిఖీ జరిగింది. ఈ మండలంలోని పలు గ్రామాల్లో మొక్కలు నాటకుండానే నాటినట్లు డబ్బులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని గ్రామాల్లో పంట కాల్వల నిర్మాణానికి సంబంధించిన పనుల్లో అవినీతి జరిగినట్లు తెలిసింది. మొత్తం మీద 1444 పనులకు గాను సుమారు రూ.10 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు.

అధికారుల అండదండలతోనే అవినీతి...

జిల్లా ఉపాధి హామీలో అక్రమార్కులు బరితెగించడానికి కారణం అధికారుల అండదండలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలవారీగా మామూళ్లు ముట్టచెబుతున్నాం కనుక మనమేం చేసినా చెల్లుబాటవుతుందన్న భరోసాతోనే కిందిస్థాయి సిబ్బంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్క దర్శి మండలంలోని ఒక గ్రామంలోనే భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటే ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది ఏ మేరకు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు.

పనిచేసినా వేతనం లేదు...

జిల్లాలోని కురిచేడు మండలంలో ఒక మహిళ గత పదేళ్లుగా ఉపాధి హామీ పనులకు వెళుతోంది. ఆయితే ఆమె వేతనం బ్యాంకులో జమ చేస్తున్నట్లు చెప్పిన స్థానిక సిబ్బంది ఆ వేతనాన్ని దిగమింగారు. వేతనం కోసం ఆమె బ్యాంకుకు వెళితే ఒక్క రూపాయి కూడా జమ కాలేదని తెలిసి ఆమె బిత్తరపోయింది. గత రెండేళ్లుగా ఆమె వేతనం కోసం అధికారులు, స్థానిక సిబ్బంది చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎలాంటి సమాధానం రావడం లేదు. చివరికి పీడీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజం లేకుండా పోయింది. పోయిన డబ్బులు తిరిగి రావు కానీ కొత్తగా మరో జాబ్‌కార్డు రాయించుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చినట్లు ఆమె వాపోతున్నారు. ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు.

ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

అవినీతికి హామీ

బతికి ఉన్న వారు పనులు చేసినా వేతనాలు వేయకుండా మింగేస్తున్న సిబ్బంది చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టడం లేదు. మరణించిన వారి వివరాలను సేకరించి వారి పేర్ల మీద జాబ్‌ కార్డులు సృష్టించి మస్టర్లు వేస్తున్నారంటే ఎంతగా బరితెగించారో అవగతమవుతుంది. జిల్లాలోని బేస్తవారిపేట, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లల చెరువు, పెద్దారవీడు, దర్శ, కొనకనమిట్ల తదితర మండలాల్లో మరణించిన వారిపేర్ల మీద మస్టర్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దారవీడు మండలంలోని తోకపల్లి పంచాయతీ పరిధిలో మూడేళ్ల క్రితం మరణించిన వారికి మస్టర్లు వేసినట్లు తనిఖీ బృందం విచారణలో తేలింది. దర్శి మండలంలోని గ్రామాల్లో కూలీలు పనులకు రాకపోయినప్పటికీ మస్టర్లు వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement